భూలావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవ... వ్యక్తి ఆత్మహత్య

భూలావదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి డబ్బులు ఇవ్వక పోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-08-09 16:13 GMT

దిశ, అల్వాల్ : భూలావదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి డబ్బులు ఇవ్వక పోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచ్చబొల్లారం మధుర ఎన్ క్లేవ్ కు చెందిన కాత ఆంజనేయులు(46) వృత్తిరీత్యా ఫ్లెక్సీ ప్రింటింగ్ వర్కర్. ఆంజనేయులు డబ్బుల విషయంలో మోసం చేశారని మనస్థాపం చెంది గురువారం మధ్యాహ్నం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించగా బంధువులు హాస్పిటల్ కు తరలించగా శుక్రవారం

     చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ మృతికి జవహార్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆంజనేయులు ఓ భూమి పంచాయితీ విషయంలో కొండల్ కలుగ చేసుకుని మధ్యవర్థిగా ఉండి ఆంజనేయులు నుండి మూడు లక్షలు తీసుకున్నాడని, అవి ఇవ్వకుండా రోజులు నెలలు అంటూ సతాయిస్తున్నాడని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  

Tags:    

Similar News