నగరంలో దారుణం.. రక్తం వచ్చేలా చితకబాదిన కానిస్టేబుల్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అమానుష ఘటన చోటుచేసుకుంది. సామాన్యుడిని ఓ కానిస్టేబుల్ విచక్షణారహితంగా చితకబాదారు.

Update: 2024-02-04 03:32 GMT
నగరంలో దారుణం.. రక్తం వచ్చేలా చితకబాదిన కానిస్టేబుల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అమానుష ఘటన చోటుచేసుకుంది. సామాన్యుడిని ఓ కానిస్టేబుల్ విచక్షణారహితంగా చితకబాదారు. విచక్షణ కోల్పోయి కంటి నుంచి రక్తం వచ్చేలా దాడి చేశాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి అనంతరం ఒంటినిండా గాయాలతో బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News