electric shock : విద్యుత్ తీగ తెగి వ్యక్తులపై పడడంతో ఒకరు మృతి
విద్యుత్ తీగ తెగి రోడ్డుపై వెళ్తున్న ముగ్గురిపై పడడంతో ఒకరు మరణించగా ఇద్దరికి గాయాలు అయిన సంఘటన బిల్లుడుతండా గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
దిశ,టేకులపల్లి : విద్యుత్ తీగ తెగి రోడ్డుపై వెళ్తున్న ముగ్గురిపై పడడంతో ఒకరు మరణించగా ఇద్దరికి గాయాలు అయిన సంఘటన బిల్లుడుతండా గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిల్లుడుతండా గ్రామానికి చెందిన భూక్య శ్రీను, తేజవత్ మోతిలాల్, భూక్య చిన్ను అనే వారు బిల్లుడుతండా
గ్రామంలో రోడ్డుపై సాయంత్రం 6 గంటలకు వెళ్తుండగా ఆదే గ్రామానికి చెందిన ఆజ్మీరా వీరన్న అనే అతడు కరెంటు వైర్లను కదిలించడం వలన వైర్ తెగి భూక్య శ్రీను, మోతిలాల్,చిన్ను మీదపడటంతో విద్యుత్ షాక్తో భూక్య శ్రీను మరణించాడు. విద్యుత్ షాక్ తగిలిన మోతిలాల్, చిన్ను కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.