బావిలో జారిపడి ఒకరు మృతి
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఒకరు ప్రమాదవశాత్తు బావిలో జారి పడి మృతి చెందాడు.
దిశ, కామారెడ్డి : కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఒకరు ప్రమాదవశాత్తు బావిలో జారి పడి మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన గడ్డమీది సత్తయ్య (58) గురువారం మధ్యాహ్నం పొందుర్తిలో ఉండే తన చెల్లెలు ఇంటికి వెళ్లి వస్తానని కాలినడకన బయలు దేరాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా పొందుర్తికి రాలేదని చెప్పారు.
దీంతో అతడి ఆచూకీ కోసం చాలా చోట్ల గాలించారు. శుక్రవారం ఉదయం కోటాలపల్లి వద్ద ఉన్న బావిలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో వెళ్లి చూశారు. మృతుడిని సత్తయ్యగా గుర్తించారు. అయితే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారి పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.