వాగులు దాటేందుకు బోట్లకు ఆర్డరిచ్చిన నక్సల్స్

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుండి ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టులకు పడవలను సరఫరా చేస్తున్న నలుగురు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-09-19 12:00 GMT

దిశ,చర్ల : తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుండి ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టులకు పడవలను సరఫరా చేస్తున్న నలుగురు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు పడవలను, డీసీఎం వాహనం, రెండు ట్రాక్టర్లు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల పోలీసు స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ వెల్లడించారు.

    చర్ల సీఐ రాజు వర్మ పర్యవేక్షణలో చర్ల స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా చింతగుప్ప, బోదనెల్లి గ్రామ సమీపంలో ఏరియా పరిశీలన చేస్తుండగా చింతగుప్ప జామాయిల్ తోట వద్ద కొంత మంది వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో మావోయిస్టు పార్టీకి గత కొంతకాలంగా మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నట్లు వారు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పామేడు, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జారిపల్లి నిమ్మలగూడెంకు చెందిన ఈ నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి డీసీఎం, రెండు బోట్లు, రెండు ట్రాక్టర్లు, రెండు బైక్​ లను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.  

Tags:    

Similar News