నాగుల పంచమి రోజు విషాదం

నాగుల పంచమి రోజు ఆలయంలో పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మహిళ మృతి చెందిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-08-09 12:34 GMT

దిశ, జూబ్లిహిల్స్ : నాగుల పంచమి రోజు ఆలయంలో పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మహిళ మృతి చెందిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భూపాల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం నాగుల పంచమి కావటంతో బోరబండ బస్టాప్ సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయంలో సుబ్రహ్మన్యేశ్వరస్వామి పుట్ట దగ్గర ఉదయం 8 గంటల సమయంలో భక్తులు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అదే సమయంలో పుట్ట దగ్గర భక్తురాలు చిలకలగూడ లక్ష్మి అనే మహిళ కళ్లు తిరిగి పడిపోవటం తో మిగతా భక్తులు

    ఒక్కసారిగా అరవటంతో పక్కనే పూజలు నిర్వహిస్తున్న ఆలయ పూజారి అరుణ్ కుమార్ మహిళను లేపి , వెంటనే అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత అంబులెన్స్ డ్యూటీ డాక్టర్ వచ్చి మహిళను పరీక్షించగా అప్పటికే మహిళ మృతి చెందింది అని డాక్టర్ నిర్దారణ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ చిలకలగూడ లక్ష్మి బోరబండ నివాసి. హాజీ బేకరీ వెనుక ఉంటుందని సమాచారం. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరికైనా ఆమె సమాచారం తెలిస్తే బోరబండ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు. 

Tags:    

Similar News