విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారంలో చోటు చేసుకుంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారంలో చోటు చేసుకుంది. ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంనకు చెందిన కలీద్ చౌస్ (40) ఇంట్లో ఫ్యాన్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై కుప్పకూలి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య రఫియా బేగం పోలీసులకు సమాచారం అందించడంతో ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.