electric shock : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది.
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు పామాయిల్ గెలలు నరుకుతుండగా విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన చిట్టేటి సూర్యచంద్రరావు (35) దమ్మపేటకు చెందిన శ్రీపాద రామాంజినేయచారి
అనే రైతు తోటలోకి చిట్టేటి సూర్యచంద్రరావు పామాయిల్ గెలలు నరకడం కోసం కూలి పనికి వెళ్లాడు. పామాయిల్ గెలలు నరుకుతుండగా ఆయన నరికే కత్తి వెళ్లి విద్యుత్ లైనుకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై సూర్యచంద్రరావు అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన పక్కన ఉన్న తోటి కూలీలు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారి వల్ల కాలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.