విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొండమల్లేపల్లి మండలం చిన్న అడిచర్లపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందాడు.
దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చిన్న అడిచర్లపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన రావుల వెంకటయ్య (55) మిల్లు పక్కనున్న తన పొలంలో పశువులు మేపుతూ నీరు తాగేందుకు గాను మిల్లులోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు కరెంటు చేయికి తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ, ఎస్సై రామ్మూర్తి చేరుకొని కేసు నమోదు చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతునికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.