నాట్కో పరిశ్రమలో కార్మికుడు మృతి

నాట్కో పరిశ్రమలో కార్మికుడు మృతి చెందిన ఘటన నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామ శివారులోని నాట్కో పరిశ్రమలో చోటు చేసుకుంది.

Update: 2024-07-10 12:25 GMT

దిశ, నందిగామ : నాట్కో పరిశ్రమలో కార్మికుడు మృతి చెందిన ఘటన నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామ శివారులోని నాట్కో పరిశ్రమలో చోటు చేసుకుంది. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామానికి చెందిన రవి (20) లిఫ్ట్ రిపేర్ చేస్తుండగా లిఫ్ట్ బొక్కెన జారి మీద పడడంతో మృతి చెందినట్లు కంపెనీ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. విషయం తెలవగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి గాయపడ్డ మరొకరిని హాస్పిటల్​కు తరలించినట్లు మేనేజర్ తెలిపారు. 


Similar News