టర్కీలో భారీ పేలుడు..ఐదుగురు మృతి

Update: 2024-07-01 05:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన టర్కీకి పశ్చిమాన ఉన్న ఇజ్మీర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 63 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌కు సంబంధించిన టాంకులో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News