మధిర‌లో హిజ్రా హత్య కలకలం..

చిన్న వెంకట్ అలియాస్ (చిన్నారి) అనే హిజ్రా హత్యకు గురైన ఘటన మండల కేంద్రంలోని ప్రకాశం రోడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది.

Update: 2023-11-21 08:07 GMT
మధిర‌లో హిజ్రా హత్య కలకలం..
  • whatsapp icon

దిశ, మధిర : చిన్న వెంకట్ అలియాస్ (చిన్నారి) అనే హిజ్రా హత్యకు గురైన ఘటన మండల కేంద్రంలోని ప్రకాశం రోడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటి మీద కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలమడుగు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సిఐ వసంత్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.


Similar News