కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: కార్మికుడు మృతి
మహారాష్ట్ర థానే జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు జరగగా ఓ కార్మికుడు మృతి చెందగా మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర థానే జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లు జరగగా అందులో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వీ తెలిపారు. ఫ్యాక్టరీలో రసాయనాలు నింపి ఉంచి డ్రమ్ములు పేలిన తర్వాత వేగంగా మంటలు వ్యాపించాయని చెప్పారు. బయట ఉన్న వాహనాలు సైతం అంటుకున్నట్టు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న అంబర్‌నాథ్, బద్లాపూర్, ఉల్లాస్‌నగర్‌ల అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులైన కార్మికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మరణించిన కార్మికుడి వివరాలు, ఘటనకు గల కారణాలు అధికారులు వెల్లడించలేదు.