అడ్డగోలుగా వచ్చాడు...ఆయువు తీశాడు...

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వేగంగా అడ్డగోలుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలంలోని రైస్ మిల్లుల సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-08-27 13:03 GMT

దిశ, వేములపల్లి : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వేగంగా అడ్డగోలుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలంలోని రైస్ మిల్లుల సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్ (53) మిల్లు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

     కాగా విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడకు వస్తుండగా హైదరాబాద్​ నుండి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News