HYD: ఆ విషయం గమనించాకే అల్పా హోటల్‌లో దాడి
అపరిశుభ్ర వాతావరణంతో పాటు, నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే అల్ప హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం మూసివేయించారు.
దిశ, బేగంపేట: అపరిశుభ్ర వాతావరణంతో పాటు, నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే అల్ప హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం మూసివేయించారు. ఈ హోటల్‌పై ఈనెల 15వ తేదీన కొంత మంది ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు జరిపి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. అయితే ఆదివారం మరోమారు అధికారుల బృందం హోటల్ తనిఖీ చేసింది.
ఈ తనిఖీల్లో కూడా హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడంలో, పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించారు. దీంతో అధికారుల బృందం ఈ హోటల్ వెంటనే మూసివేని తగిన పరిశుభ్ర చర్యలను తీసుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించింది. దీంతో తదుపరి చర్యల కోసం యాజమాన్యం హోటల్ మూసివేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి హోటల్ యాజమాన్యానికి పెనాల్టీ విధిస్తామని అధికారులు తెలిపారు.