స్పానిష్ టూరిస్టుపై గ్యాంగ్ రేప్: జార్ఖండ్‌లో ఘటన

జార్ఖండ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. విహార యాత్రలో భాగంగా రాష్ట్రంలోని దుమ్కాలో పర్యటిస్తున్న స్పానిష్ టూరిస్టు మహిళపై సుమారు 10 మంది దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

Update: 2024-03-02 06:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. విహార యాత్రలో భాగంగా రాష్ట్రంలోని దుమ్కాలో పర్యటిస్తున్న స్పానిష్ టూరిస్టు మహిళపై సుమారు 10 మంది దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్పానిష్‌కు చెందిన దంపతులు విహారయాత్ర నిమిత్తం ఆసియాలో పర్యటిస్తున్నారు. మొదట వీరు పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి నుంచి బంగ్లాదేశ్ వెళ్లారు. అనంతరం బంగ్లాదేశ్ మీదుగా జార్ఖండ్‌లోని దుమ్కాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి దంపతులిద్దరూ శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై బిహార్‌లోని భాగల్‌పూర్ వెళ్తుండగా..హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంజి గ్రామంలో సుమారు 8 నుంచి 10 మంది దుండగులు వారిని అడ్డగించి మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న భర్తపైనా దాడి చేశారు. దీంతో దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృంధాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ సరైయాహట్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుంజీ గ్రామానికి చెందిన యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News