మాజీ ముఖ్యమంత్రికి తప్పిన ముప్పు.. భద్రతా సిబ్బందికి గాయాలు
జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కారు ప్రమాదానికి గురైంది. ముఫ్తీ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముఫ్తీ కారు ముందు భాగం స్వల్పంగా డ్యామేజ్ కాగా, సురక్షితంగా ముఫ్తీ బయటపడ్డారు.
దిశ, వెబ్డెస్క్: జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కారు ప్రమాదానికి గురైంది. ముఫ్తీ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముఫ్తీ కారు ముందు భాగం స్వల్పంగా డ్యామేజ్ కాగా, సురక్షితంగా ముఫ్తీ బయటపడ్డారు. ఆమె భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంత్ నాగ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాబాల్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఆమె మరో కారులో పరామర్శకు వెళ్లారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.