ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం లారీని ఢీకొనడంతో డీసీఎం వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం లారీని ఢీకొనడంతో డీసీఎం వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మక్తల్ మండలం బొందలకుంటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.