మధప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2024-04-02 04:15 GMT
మధప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం తెల్లవారుజామున 8 మంది ప్రయాణికులతో కూడిన ఆటో చిత్రకూట్‌కు వెళ్తుండగా ఝాన్సీ మీర్జాపూర్ జాతీయ రహదారికి సమీపంలో ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వేగంగా వచ్చిన డంపర్ ఆటో రిక్షాను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రయాగ్ రాజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారందరి పరిస్థితీ విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిత్రకూట్ ఎస్పీ చక్రపాణి త్రిపాఠి వెల్లడించారు. అయితే మృతుల వివరాలను వెల్లడించలేదు. మరోవైపు రాష్ట్రంలోని మొరెనా జిల్లాలో సోమవారం రాత్రి బస్సు బోల్తా పడడంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Tags:    

Similar News