Accident: కాళ్లకల్ బంగారంమ్మ దేవాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ దేవాలయం ముందు 44వ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ దేవాలయం ముందు 44వ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బాసర పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా బంగారంమ్మ దేవాలయం వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన అజరావు అనే మహిళతో పాటు
Acc ఆమె కుటుంబ సభ్యులు భాస్కర రావు, మనోజ్ కుమార్, మీనా, ధనలక్ష్మి, వారి కుటుంబ సభ్యులంతా బాసర పుణ్యక్షేత్రానికి కారులో బయలుదేరారు. కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్దకు రాగానే అదుపుతప్పి కారు డివైడర్ను ఢీకొని పక్కనే ఉన్న గుంటలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న అజారావు (55) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సకాలంలో స్థానిక ఎస్సై సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని గాయాల పాలైన బాధితులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భాస్కరరావు (57) మృతి చెందారు. ఈ వాహనంలో ఏడుగురు పెద్దవారు, నలుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఎర్రగడ్డలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు మంగవెల్లి శిబుకుమార్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.