విద్యుత్ షాక్ తో రైతు మృతి
విద్యుత్ శాఖతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణం అవుసుల పల్లిలో శనివారం ఉదయం జరిగింది.
దిశ, మెదక్ ప్రతినిధి : విద్యుత్ శాఖతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణం అవుసుల పల్లిలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన కందుల రాములు (42) తన వ్యవసాయ పొలం వద్ద పొలం పనులకు వెళ్ళాడు. పొలం వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానిక రైతులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ లు కేసునమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని మెదక్ ఆసుపత్రికి తరలించారు.