గడ్డి కోస్తుండగా విద్యుత్​ షాక్...​

విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజంపేట్ మండలంలోని గుండారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.

Update: 2024-09-14 09:29 GMT

దిశ, తాడ్వాయి : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజంపేట్ మండలంలోని గుండారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై పృధ్వీరాజ్ కథనం ప్రకారం..ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముక్కిరి ఎల్లయ్య (41) తన వ్యవసాయ పొలంలోని బోరు మోటార్ దగ్గర ఏపుగా పెరిగిన గడ్డిని కోస్తుండగా ప్రమాదవశాత్తు బోరు మోటార్ కు విద్యుత్ సరఫరా అవుతున్న వైరును తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. 

Tags:    

Similar News