ఉల్లిగడ్డల లోడులో దర్జాగా గంజాయి తరలింపు
మహారాష్ట్రకు చెందిన వాల్మీకి రూప మహితే , బాతు దేవ్రం చౌహాన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కూరగాయాల మార్కెట్ నుంచి ఉల్లిగడ్డల లోడుతో 60 కిలోల గంజాయి సరఫరా చేస్తుండగా ఇబ్రహీం పట్నం వద్ధ వీరిని ఆదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
దిశ, మల్కాజిగిరి : మహారాష్ట్రకు చెందిన వాల్మీకి రూప మహితే , బాతు దేవ్రం చౌహాన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కూరగాయాల మార్కెట్ నుంచి ఉల్లిగడ్డల లోడుతో 60 కిలోల గంజాయి సరఫరా చేస్తుండగా ఇబ్రహీం పట్నం వద్ధ వీరిని ఆదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. వీరు నాసిక్, మహారాష్ట్ర రోడ్డు మార్గం మీదుగా మారుతి స్విఫ్ట్ కారు లో గంజాయి తరలిస్తున్నారనీ, దీని విలువ సుమారు రూ .35 లక్షలు ఉంటుందన్నారు.
ఎస్ ఓటీ మహేశ్వరం జోన్ ఇబ్రహీంపట్నం పోలీసులు గంజాయి ముఠాను ఆదుపులోకి తీసుకుని వారి వద్ధ నుంచి మూడు సెల్ ఫోన్ లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు వ్యాపారాల్లో నష్టాలు చవిచూసి , సులువుగా డబ్బు సంపాదించాలనే డ్రగ్స్ కు అలవాటు పడ్డారని తెలిపారు. డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో భువనగరి డీసీపీ రాజేష్ చంద్ర, డీసీపీ రమణారెడ్డి, మల్కాజిగిరి, భువనగిరి ఎస్ ఓటీ డీసీపీ నర్సింహారెడ్డి, ఎస్ ఓటీ ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్స్ టీం రాములు, ప్రవీన్ బాబు, రవికుమార్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.