మద్యం మత్తులో డయల్​ 100కి ఫోన్

ఆపదలో ఉన్న పోలీస్ల సహాయం కోసం 100 డయల్​ ఫోన్ చేస్తే తక్షణమే పోలీస్ సిబ్బంది బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందజేస్తారు.

Update: 2024-09-06 11:36 GMT

దిశ, ఖానాపూర్ : ఆపదలో ఉన్న పోలీస్ల సహాయం కోసం 100 డయల్​ ఫోన్ చేస్తే తక్షణమే పోలీస్ సిబ్బంది బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందజేస్తారు. దానికి విరుద్ధంగా ఓ వ్యక్తి మద్యం మత్తులో 100 కు డయల్ చేసి జైలు పాలైన సంఘటన ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ సైదారావు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి శుక్రవారం అధికంగా మద్యం తాగి డయల్​ 100 కు అకారణంగా పలుమార్లు ఫోన్ చేస్తూ, పోలీసు సిబ్బంది విలువైన సమయాన్ని వృథా చేశాడు. దాంతో న్యూసెన్స్ చేసిన లక్ష్మణ్ పై న్యూ సెన్స్ కేసు పెట్టి కోర్టులో హాజరుపరిచారు. దాంతో ఆ వ్యక్తి పై మేజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించారు అని ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు, ఎస్సై జి.లింబాద్రి తెలిపారు. 

Tags:    

Similar News