తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు తప్పిన ప్రమాదం

ఆదివారం ఉదయం తిరుపతికి వెళుతున్న మొదటి ఘాట్ రోడ్డు 15వ మలుపు సమీపంలో ఇనోవా కారు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది.

Update: 2024-04-14 13:29 GMT

దిశ, తిరుమల: ఆదివారం ఉదయం తిరుపతికి వెళుతున్న మొదటి ఘాట్ రోడ్డు 15వ మలుపు సమీపంలో ఇనోవా కారు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు భక్తులను మరో వాహనంలో తిరుపతికి పంపించారు. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, టిటిడి అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను చక్కదిద్దే చర్యలు చేపట్టారు.


Similar News