ఉత్తరాఖండ్‌లో డేరా చీఫ్ దారుణ హత్య: కాల్చి చంపిన దుండగులు
ఉత్తరాఖండ్‌లోని నానక్ మట్టా సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ బాబా టార్సెమ్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున టార్సెమ్ సింగ్ ఆశ్రమంలోని ఆవరణలో ఒంటరిగా కూర్చీపై కూర్చుని ఉన్నాడు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని నానక్ మట్టా సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ బాబా టార్సెమ్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున టార్సెమ్ సింగ్ ఆశ్రమంలోని ఆవరణలో ఒంటరిగా కూర్చీపై కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలోనే బైకుపై వచ్చిన దుండగులు ఆతనిపై కాల్పులకు తెగపడ్డారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన టార్సె్మ్‌ను ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి మరణించినట్టు ఉదమ్ సింగ్ నగర్ ఎస్ఎస్పీ మంజునాథ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరింత లోతైన విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉధమ్ సింగ్ జిల్లాలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. శాంతియుతంగా ఉండాలని సిక్కులకు సూచించారు. కాగా, నానక్ మట్ట సాహిబ్ గురుద్వారా అనేది రాష్ట్రంలోని ప్రముఖ సిక్కుల పుణ్యక్షేత్రం. ఇది ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఉంది. పంజాబ్, హర్యానా, యూపీల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది వస్తుంటారు. బాబా తార్సేమ్ సింగ్ సైతం రాష్ట్ర మంతా గుర్తింపు కలిగిన వ్యక్తి కావడం గమనార్హం.