Overtake effect : ఓవర్టేక్ చేయబోయి మృత్యువాత
బిర్యాని తినేందుకు వచ్చి లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ ను ఢీ కొట్టి అదుపు తప్పి కిందపడగా పక్కనుంచి మరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
దిశ, పరిగి : బిర్యాని తినేందుకు వచ్చి లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ ను ఢీ కొట్టి అదుపు తప్పి కిందపడగా పక్కనుంచి మరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరిగి ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం బొంరాస్ పేట్ మండల కేంద్రానికి చెందిన నజీబ్ అలియాస్ నజ్జు ( 27), శేఖర్, దుర్గప్ప, అశోక్, సీతారాం వీళ్లంతా ద్విచక్ర వాహనాలపై పరిగికి బయలుదేరారు. పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామ
Overtake effectశివారులోకి రాగానే హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారి ( హైవే 163 ) పై లారీని ఓవర్ టేక్ చేయబోయిన నజీబ్, శేఖర్ లు ముందు వెళ్తున్న వీరి స్నేహితుల ద్విచక్రవాహనంను ఢీ కొన్నారు. దీంతో నజీబ్ హైవే రోడ్డుపై కుడివైపునకు పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని వాహనం నజీబ్ పై నుంచి వెళ్లడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. నజీబ్ అతని స్నేహితులంతా ఓ క్రషర్ మిషన్ లో డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఢీ కొట్టి వెళ్లిన వాహనం తవేరా అని అనుమానిస్తున్నారు. ఢీ కొట్టి వెళ్లిన వాహనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు.