సైబర్‌ నేరస్తుడు అరెస్టు

దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగుల్లో ప్రజలను నమ్మించి కోట్లల్లో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన సైబర్‌ నేరగాన్ని వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Update: 2024-09-04 12:19 GMT

దిశ, హనుమకొండ : దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగుల్లో ప్రజలను నమ్మించి కోట్లల్లో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన సైబర్‌ నేరగాన్ని వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నయ్​ ప్రాంతానికి చెందిన మరియా బెనెడిక్ట్‌(38) గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రజలను నమ్మించి పెట్టిన డబ్బుకు రెట్టింపు డబ్బు తిరిగి వస్తుందని మోసం చేసి కోట్లల్లో కొల్లకొడుతున్నాడు. ఇలా దోచుకున్న డబ్బును మరింత భద్రం చేసుకునేందుకు బ్యాంక్‌ నుండి విత్‌డ్రా చేసేవాడు.

     ఈ డబ్బును నిందితుడు క్రిప్టో కరెన్సీ, డాలర్స్‌గా మార్చి తిరిగి సైబర్‌ నిందితులకు సంబంధించిన వ్యక్తిగత ఖాతాలకు జమ చేసేవాడు. గత నెల హనుమకొండ నగరంలో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో ముప్పై మూడు లక్షల యాబై వేల రూపాయల డబ్బు నష్టపోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు అధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడి అచూకీ కనిపెట్టి చెన్నయ్​లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్‌ కమిషనరేట్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, ఇన్​స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్‌ఐలు చరణ్‌, శివకుమార్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, రాజేష్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, రాజును పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అభినందించారు. 

Tags:    

Similar News