స్పా ముసుగులో క్రాస్ మసాజ్.. విదేశీ యువతితో పాటు ఏడుగురు అరెస్ట్!
స్పా పేరుతో క్రాస్ మసాజ్ జరిపిస్తున్న ఇద్దరు నిర్వాహకులతోపాటు రిసెప్షనిస్టు, నలుగురు యువతులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: స్పా పేరుతో క్రాస్ మసాజ్ జరిపిస్తున్న ఇద్దరు నిర్వాహకులతోపాటు రిసెప్షనిస్టు, నలుగురు యువతులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఓ యువతి విదేశీయురాలు కావటం గమనార్హం. పాతబస్తీ బహదూర్ పురాకు చెందిన అనిల్ కుమార్, కిషన్ సింగ్ హజారీ స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించాలని హిమాయత్ నగర్లో స్పా సెంటర్ ప్రారంభించారు. బోరబండకు చెందిన దుర్గాప్రసాద్‌ను రిసెప్షనిస్టుగా నియమించుకున్నారు. భారీ మొత్తాల్లో డబ్బు ఇస్తామని ఓ విదేశీయురాలితో పాటు మరో ముగ్గురు యువతులను ఫిజియో థెరపిస్టులను ఉద్యోగాల్లో పెట్టుకున్నారు.
వీరితో మగవారికి మసాజులు చేపిస్తున్నారు. విషయం తెలిసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అనిల్ కుమార్, కిషన్ సింగ్, దుర్గాప్రసాద్ లతోపాటు నలుగురు యువతులను అరెస్ట్ చేశారు. మసాజ్ చేయించుకోవటానికి స్పాకు వచ్చిన అజ్మత్ అలీ అన్సారీ, కృష్ణకుమార్ బాహెతి, అజయ్ సింగ్, రామనాథన్, ప్రియేష్ చందులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం దోమలగూడ పోలీసులకు అప్పగించారు.