పెళ్లి విందులో ఘర్షణ
పచ్చని పెళ్లిపందిరిలో ఘర్షణ చోటు చేసుకుంది. పెళ్లి విందులో జరిగిన ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి.
దిశ, నవీపేట్ : పచ్చని పెళ్లిపందిరిలో ఘర్షణ చోటు చేసుకుంది. పెళ్లి విందులో జరిగిన ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వధువు కు నందిపేట్ మండలం భాద్గుణ కు చెందిన వరుడికి మండల కేంద్రలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరిగింది. ఈ సమయంలో భోజనాల వద్ద ఏర్పడిన ఘర్షణలో ఇరువర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దాంతో కొందరు 100 కి ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని అదుపు చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు దాడి చేసుకున్న ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్సై వినయ్ తెలిపారు.