ఆప్ఘనిస్థాన్‌లో బస్సు, ట్యాంకర్, బైక్ ఢీ: 21 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. బస్సు, ట్యాంకర్, బైక్ ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి చెందారు. దక్షిణ ఆప్ఘనిస్థాన్‌లోని కాందహార్ మరియు పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది.

Update: 2024-03-17 10:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. బస్సు, ట్యాంకర్, బైక్ ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి చెందారు. దక్షిణ ఆప్ఘనిస్థాన్‌లోని కాందహార్, పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. హెరాత్ నగరం నుంచి రాజధాని కాబూల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రోడ్డుపై బైకుని ఢీకొట్టింది.. అనంతరం బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి అదే రోడ్డులో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను తాకింది. దీంతో మంటలు చెలరేగగా..21 మంది అక్కడి కక్కడే మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. వెంటనే విషయం తెలుసుకున్న రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా..అందులో 11మంది పరిస్థితి విషయంగా ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.ఈ ప్రమాదంలో ట్యాంకర్‌లోని ముగ్గురు వ్యక్తులు, 16 మంది బస్సు ప్రయాణికులు, బైకు మీదున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెల్మండ్ పోలీస్ అధికారి హజతుల్లా హక్కానీ తెలిపారు. కాగా, ఆప్ఘనిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణంగా మారాయి. రోడ్లు బాగా లేకపోవడం, ప్రధాన రహదారులపై డ్రైవింగ్‌పై నియంత్రణ లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. 2022 డిసెంబర్‌లోనూ ఓ చమురు ట్యాంకర్ బోల్తాపడి 31 మంది మరణించగా అనేక మంది గాయాలపాలయ్యారు. 

Tags:    

Similar News