theft : ఇంటి తలుపులు పగులగొట్టి చోరీ

గుర్తుతెలియని దుండగులు తాళం వేసిన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి నగదు బంగారం వెండి ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది.

Update: 2024-07-28 15:20 GMT

దిశ, కౌడిపల్లి : గుర్తుతెలియని దుండగులు తాళం వేసిన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి నగదు బంగారం వెండి ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకాగోని అంజాగౌడ్ భార్య మంజుల కూతురు అల్లుడు కుమారుడితో కలిసి ఈనెల 27న ఇంటికి తాళం వేసి పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉన్న తోడల్లుడు ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఇదే అదునుగా చూసి గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాను తెరిచి అందులోనుంచి ఒక లక్షా 77 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండి ఆభరణాలను గుర్తుతెలియని

    దుండగులు అపహరించారు. ఇంటి తలుపులు పగలగొట్టిన విషయాన్ని పక్క ఇంటి తునికి లక్ష్మి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అంజాగౌడ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఈనెల 28న అంజా గౌడ్ వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులుగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. బీరువాలో దాచిపెట్టిన నగదు రూపాయలతో పాటు బంగారం వెండి ఆభరణాలు చోరీకి గురైన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు అంజాగౌడ్ ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి , ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బంది వెళ్లారు. నగదు బంగారు వెండి ఆభరణాల విలువ సుమారు 2 లక్షల 70 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. చోరీ ఘటనకు సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News