BREAKING: ఏసీబీకి చిక్కిన నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ఏసీబీ)కి ఓ టౌన్ ప్లానింగ్ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా అదపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేటలో చోటుచేసుకుంది.

Update: 2024-03-18 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ఏసీబీ)కి ఓ టౌన్ ప్లానింగ్ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా అదపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట పట్టణంలో ఓ టీ పాయింట్ బోర్డును తొలగించకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస‌రావు షాపు యజమాని నుంచి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు శ్రీనివాస‌రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతడి సహకరించిన మరో వ్యక్తిని కూడా వారు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇద్దరినీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.    

Tags:    

Similar News