BREAKING: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో డబ్బు వసూలు.. ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో నకిలీ ఎస్సై

ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులకు చేదోడువాదొడుగా ఉండి వారికి ఆర్థికంగా దన్నుగా నిలబడాలని ఏ కూతురు, కొడుకు అనుకోరు.

Update: 2024-04-14 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులకు చేదోడువాదొడుగా ఉండి వారికి ఆర్థికంగా దన్నుగా నిలబడాలని ఏ కూతురు, కొడుకు అనుకోరు. తమకు జన్మనిచ్చిన వారికి కాస్త విశ్రాంతినిచ్చి నాలుగు రాళ్లు సంపాదించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్న యువతకు నిరాశే ఎదురువుతోంది. వాళ్ల ఆశలను ఆసరగా చేసుకుని కొంత‌మంది అక్రమార్కులు అందినకాడికి దొచుకుంటున్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా మాయమాటలు చెప్పి అక్రమార్కులు వారి బుట్టలో వేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసగాళ్లు యువతను నిలువునా మోసం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉద్యోగం ఇప్పిస్తానంటూ సోమ్లానాయక్ అనే వ్యక్తి నకిలీ ఎస్సైగా అవతారమెత్తాడు. ఈ క్రమంలోనే జాబ్ కోసం వెతుకుతున్న గౌరీశంకర్‌‌కు ఉద్యోగం ఇప్పిస్తానని అతడి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. డబ్బు తీసుకుని ఉద్యోగం గురించి ఎలాంటి సమాచారం అడిగినా.. సోమ్లా‌నాయక్ సమాధానం చెప్పకపోవడంతో చివరకు బాధితుడు గౌరీశంకర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమ్లా‌నాయక్‌ను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా సోమ్లానాయక్ పలువురి నుంచి రూ.11 లక్షలు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.  

Tags:    

Similar News