BREAKING: వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసికందు ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కు చెందిన శిరీష దంపతులు ప్రసవం కోసం వనస్థలి ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే శిరీషకు నొప్పులు రాగా.. డెలివరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే, శిశువు బొడ్డుపేగును డెలివరీ అనంతరం కట్ చేయాల్సి ఉండగా.. ముందుగానే కట్ చేయడంతో ఉమ్మనీరు మింగి సర్జరీ జరుగుతుండగానే శిశువు ప్రాణాల విడిచింది. దీంతో ఏం చేయాలో తెలియక చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు.. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా సర్జరీ సమయంలో ఉమ్మనీరు ఎక్కువై బిడ్డ చనిపోయిందంటూ బుకాయించారు. ఈ పరిణామంతో పసికందు తల్లిదండ్రులు, బంధవులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.