బీజేపీ ఎమ్మెల్యే కారు బోల్తా

కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ మట్టిముడ కారు ప్రమాదానికి గురైంది.

Update: 2024-01-14 08:03 GMT
బీజేపీ ఎమ్మెల్యే కారు బోల్తా
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని కల్బుర్గికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ మట్టిముడ కారు ప్రమాదానికి గురైంది. షహబాద్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తుండగా.. తమ కారుకు ఎదురుగా ద్వి చక్ర వాహనం రాగా డ్రైవర్ కారును తప్పించే క్రమంలో వాహనం బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఐదురుగు వ్యక్తులు ఉండగా అందులో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ముందు సీటులో కూర్చోవడంతో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 

Tags:    

Similar News