బ్యాటరీ, సోలార్ ప్లేట్ల దొంగల అరెస్ట్
కోటపల్లి మండలం వెల్మపల్లి గ్రామంలో గుర్రం సురేష్ అనే రైతుకు చెందిన సోలార్ ప్లేట్, బ్యాటరీని చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, కోటపల్లి : కోటపల్లి మండలం వెల్మపల్లి గ్రామంలో గుర్రం సురేష్ అనే రైతుకు చెందిన సోలార్ ప్లేట్, బ్యాటరీని చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో లక్ష్మీపూర్ గ్రామం వద్ద ఎస్సై రాజేందర్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చిన ఆటోను ఆపి తనిఖీ చేయగా సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అందులోని కోటపల్లి మండలం లక్ష్మీపూర్ కు చెందిన పానెం సూర్యకిరణ్, గోట రాజేందర్, పానెం మనోజ్ సూర్యకిరణ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన దొంగతనంను ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.