మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ గురువారం అనారోగ్యం కారణంగా మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2024-09-05 14:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ గురువారం అనారోగ్యం కారణంగా మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో ఉంటున్న పూదరి లింగమణి (49) అనే మహిళ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. మూడేళ్ల క్రితం గంగమణి భర్త భోజరాం భర్త మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి.

    భర్త చనిపోవడం, అనారోగ్య సమస్యలు వీటన్నింటితో జీవితంపై విరక్తి చెంది గంగమణి తన ఇంట్లో బాత్ రూంలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె చిన్న కూతురు తల్లి బాత్ రూంకు వెళ్లి చాలాసేపవుతున్నా బయటికి రాకపోవడంతో అనుమానంతో వెళ్లి చూసింది. ఉరి వేసుకుని కొన ఊపిరితో తల్లిని చూసి స్థానికులు బంధువుల సహకారంతో అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News