ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న బైక్...​ ఒకరు మృతి

రోడ్డు పైన ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనదారుడు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-08-24 16:29 GMT

దిశ, యాచారం : రోడ్డు పైన ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనదారుడు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మాల్ గ్రామానికి చెందిన శ్యామల శివకోటి (21), విష్ణు తో కలిసి తమ గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరి మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి వెళ్తుండగా గున్ గల్ క్రీడా సమీపం వద్దకు చేరుకోగానే రోడ్డుపైన ఎలాంటి సిగ్నల్ లేకుండా నిలిచి ఉన్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. దాంతో తీవ్ర గాయాల పాలైన శివకోటి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన విష్ణును చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News