బాలికను మోసం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలు

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ మైనర్ బాలికను మోసం చేసిన ఓ యువకుడికి నిర్మల్ జిల్లా కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

Update: 2024-09-12 14:31 GMT

దిశ, ఖానాపూర్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ మైనర్ బాలికను మోసం చేసిన ఓ యువకుడికి నిర్మల్ జిల్లా కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 15 వందల రూపాయల జరిమానా విధించింది. ఖానాపూర్ ఎస్ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకి చెందిన దుర్కే బాలాజీ అనే వ్యక్తి ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఉన్న శ్రీ సాయి ఇండస్ట్రీస్‌లో సిమెంట్ ఇటుకలను తయారు చేస్తూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇక్కడే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చాంద్ కుమార్ మరవి అనే యువకుడు వీరితో కలిసి అక్కడే కూలీగా పని చేసేవాడు.

     ఈ క్రమంలో బాలాజీ కూతురును ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆమెపై లైంగికదాడి చేశాడు. అనంతరం ఆమెను మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి నిర్భందించి అనేక సార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయం గురించి బాలిక తండ్రి దుర్కే బాలాజీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి నేరస్తుడిని అరెస్టు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వాస్ రెడ్డి 15 మంది సాక్షులను కోర్టులో విచారించారు. బాలికను లైంగికంగా వేధించినట్లు కోర్టులో రుజువు అయింది. నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కర్ణ కుమార్ నేరస్తుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ రూ. 15 వందల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.   

Tags:    

Similar News