Robbers : దారివెంట వెళ్లే వారిని కత్తితో బెదిరించి 10 వేల నగదు దోపిడీ

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి వెంట వెళ్లే వారిని అర్ధరాత్రి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దోచుకుంటున్న నలుగురు వ్యక్తులను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

Update: 2024-08-03 15:19 GMT

దిశ, ఖైరతాబాద్ : ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి వెంట వెళ్లే వారిని అర్ధరాత్రి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దోచుకుంటున్న నలుగురు వ్యక్తులను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఎస్ఆర్ నగర్ , ఎస్ఆర్టీలోని విష్ణు బాయ్స్ హాస్టల్ లో ఉండే పవన్ అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి పంజాగుట్టలో సెకండ్ షో సినిమా చూసి తిరిగి హాస్టల్ కు వస్తుండగా ఎస్ఆర్ నగర్,

    ఎస్ఆర్టీ వద్ద తరుణ్ , శ్రీను, అద్నాన్ , బబ్లూ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు పోలీస్ ఇన్ఫార్మర్లమంటూ కత్తితో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగింది ఇవ్వలేదంటే గంజా అముతున్నారని, ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నారు అని పోలీసులకు చెప్పి జైలుకు పంపిస్తామని బెదిరించి ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు దోచుకున్నారు. మరుసటి రోజు బాధితులు పోలీసులకు సంచారం అందించగా ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఆధారంగా నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  

Tags:    

Similar News