చైన్ స్నాచింగ్ తరహాలో.. లక్ష 96 వేలు చోరీ..

బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేసుకొని ఇంటికి బైక్ పై వెళుతుండగా వెనక నుండి వచ్చిన ఆగంతకుడు లక్ష 96 వేలు, విలువైన డాక్యుమెంట్లు కలిగిన క్యాష్ బ్యాగ్ లాక్కొని పారిపోయారు.

Update: 2024-09-11 16:35 GMT

దిశ, నవీపేట్ : బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేసుకొని ఇంటికి బైక్ పై వెళుతుండగా వెనక నుండి వచ్చిన ఆగంతకుడు లక్ష 96 వేలు, విలువైన డాక్యుమెంట్లు కలిగిన క్యాష్ బ్యాగ్ లాక్కొని పారిపోయారు. పూర్తి వివరాల్లోకెళితే మాక్లూర్ మండలం అల్వాపూర్ గ్రామనికి చెందిన రైతు చిన్నయ్య నవీపేట్ మండలం జన్నేపల్లి లోని కెనరా బ్యాంకు నుంచి 1 లక్ష 96 వేలు డ్రా చేసుకొని తన భార్యతో కలిసి బైక్ పై ఇంటికి వెళుతున్నారు. వెనక నుండి తెల్ల రంగు స్కూటీ పై వెంబడించిన ఆగంతకుడు బాధితుని భార్య చేతి నుండి బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. బ్యాగ్ లో లక్ష 96 వేల నగదుతో పాటుగా పట్టా పాస్ బుక్స్, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా బుక్కులు ఉన్నాయని, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నవీపేట్ ఎస్సై కే. వినయ్ తెలిపారు.


Similar News