అయోధ్య రాముడి ఫొటోలు లీక్.. తీర్థక్షేత్ర చీఫ్ షాకింగ్ రియాక్షన్
దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సరం రెండ్రోజుల్లో జరుగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సరం రెండ్రోజుల్లో జరుగనుంది. ఈ వేడుకకు యూపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. జనవరి 22 సోమవారం రోజున రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా జరునుంది. ఇదిలా ఉండగా.. అయోధ్యలో ప్రతిష్టించే రాముడి విగ్రహ ఫొటోలు లీక్ అయ్యాయి. రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఫొటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా.. దీనిపై రామజన్మ భూమి తీర్థక్షేత్ర చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ‘ప్రాణప్రతిష్ట ముగిసే వరకు శ్రీరాముడి కళ్లు చూపించకూడదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న విగ్రహం నిజం కాదు. ఒకవేళ అవి రాముడి కళ్లే అయితే.. దానిపై విచారణ చేస్తాం. ఫొటోలు ఎలా బయటకు వచ్చాయనే దానిపై ఆరా తీస్తాం’ అని ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు.