అయోధ్యలో ప్రధాని మోడీ కటౌట్ల తొలగింపు
దేశవ్యాప్తంగా చర్చలన్నీ ఈ నెల 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవం చుట్టే తిరుగుతున్నాయి. ప్రధాని చేతుల మీదుగా జరగబోయే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్ని చకచకా జరిగిపోతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా చర్చలన్నీ ఈ నెల 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవం చుట్టే తిరుగుతున్నాయి. ప్రధాని చేతుల మీదుగా జరగబోయే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్ని చకచకా జరిగిపోతున్నాయి. శ్రీరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య అంతా ముస్తాభవుతోంది. ఈ క్రమంలో అయోధ్యలో శ్రీరాముడితో పాటు ప్రధాని నరేంద్రమోడీ కటౌట్ ల ఏర్పాటు హాట్ టాపిక్ గా మారింది. అయోధ్యలోని మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో శ్రీరాముడితో పాటు ప్రధాని మోడీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో స్పందించిన సంబంధిత అధికారులు శ్రీరాముడితో పాటు ఏర్పాటు చేసిన మోడీ కౌటౌట్లను తొలగించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ రోడ్డులో శ్రీరాముడి కటౌట్ లు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.
Cutouts of PM Modi which were installed along with Lord Ram removed from Maharishi Valmiki International Airport road in Ayodhya after criticism
— ThePrintIndia (@ThePrintIndia) January 19, 2024
Photos: Praveen Jain @PraveenJain2622 #ThePrintPictures pic.twitter.com/1ZfV02pByM