జనవరి 22న కేంద్ర కార్యాలయాలు, సంస్థలకు హాఫ్ డే లీవ్‌

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న జనవరి 22వ తేదీన సగం రోజు లీవ్ ఇస్తున్నట్లు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Update: 2024-01-18 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న జనవరి 22వ తేదీన సగం రోజు లీవ్ ఇస్తున్నట్లు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆలయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని వీక్షించే వెసులుబాటును ఉద్యోగులకు కల్పించేందుకు ఆ రోజున(సోమవారం) మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు హాఫ్ డే లీవ్‌ను అనౌన్స్ చేశామని వెల్లడించింది. రామమందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు ఒక రోజు సెలవు ఇవ్వాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ మహోత్సవాన్ని వీక్షించే గొప్ప అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించేందుకు దేశ, విదేశాల్లోని ఎన్నో సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఇక అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో టెలికాస్ట్ చేసేందుకు దూరదర్శన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి పటిష్ట భద్రత కల్పించేందుకు పెద్దసంఖ్యలో కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలను అయోధ్యలో మోహరించారు.

Tags:    

Similar News