రాజకీయం చేస్తున్నారు.. రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లను : పూరి శంకరాచార్య

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై పూరి శంకరాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-11 11:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై పూరి శంకరాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న జరిగే రామాలయ మహా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఒడిశాలోని పూరిలో ఉన్న గోవర్ధన మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి(పూరి శంకరాచార్య) నిరాకరించారు. ఆ కార్యక్రమ నిర్వహణలో సరైన నిబంధనలను పాటించడం లేదని, దానిపై రాజకీయాలు జరుగుతున్నాయని కామెంట్ చేశారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతున్నందున దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ‘‘అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రధాని మోడీ సమక్షంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దీనికి రాజకీయ కోణం ఇస్తున్నారని అనిపిస్తోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను గౌరవప్రదంగా చేయాలి. ఈ కార్యక్రమానికి నేను హాజరుకావడం లేదు. అంతే తప్ప వ్యతిరేకించడం లేదు’’ అని పూరి శంకరాచార్య స్పష్టం చేశారు. ‘‘నా అభిప్రాయాలను నేను వ్యక్తపరిచాను. మరే ఉద్దేశమూ నాకు లేదు. అంతా సవ్యంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని చెప్పారు. ఇక ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్ మఠం మఠాధిపతి కూడా ఇటీవల ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.

Tags:    

Similar News