జై శ్రీరాం ఆర్ట్ వర్క్ తో కళకళలాడిన అంబానీ నివాసం

మరికొన్ని గంటల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Update: 2024-01-21 18:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మరికొన్ని గంటల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం విద్యుద్దీపాలతో కళకళలాడుతోంది. ముఖేష్ అంబానీ నివాసమైన అంటిలియా జై శ్రీరాం కళాఖండాలతో వెలిగిపోయింది. రాముడిని స్తుతిస్తూ శ్లోకాలు, రాముడి నినాదాలను బిల్డింగ్ పైన విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. మరోవైపు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసం కూడా లైట్లతో వెలిగిపోయింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రాణప్రతిష్ఠ వేడుకకు సర్వం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.


Similar News