శ్రీరాముడికి చెల్లి ఉందని తెలుసా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ శ్రీరాముని నామమే వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో అయోధ్యలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో

Update: 2024-01-18 03:57 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ శ్రీరాముని నామమే వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో అయోధ్యలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో అయోధ్య రామయ్యకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

శ్రీరాముని చరిత్రగురించి మనకు తెలిసినా, ఆరామాయణం ఎన్నిసార్లు విన్నా మనకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.అయితే రాముడి జీవిత పాత్ర గురించి అనేక గ్రంథాలు రాసినప్పటికీ, మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.అందులో ఒకటి శ్రీరాముడి సోదరి.

ఇప్పటికీ శ్రీరాముడికి సోదరి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు.కొన్ని గ్రంథాలలో ఆమె గురించి రాసినప్పటికీ చాలా మందికి తన గురించి తెలియదు.

కొన్ని గ్రంథాలలో శ్రీరాముని సోదరి, ఆమె పేరు శాంత వర్ణన ఉంది. దశరథ రాజు స్నేహితుడు అంగ రాజు రోంపాద్‌కు పిల్లలు లేనందున శాంతను దత్తత తీసుకున్నాడంట.అయితే సోదరి గురించి ఇప్పటికీ ఎక్కడా ఎలాంటి పూర్తి సమాచారం ఇవ్వలేదు.

Tags:    

Similar News