హే రామ్.. యే క్యా హై! అయోధ్యలో 60 మంది మంగళసూత్రాలు మాయం

500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది.

Update: 2024-02-11 07:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: 500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేద మంత్రాల నడుమ, శ్రీరామ నామ పరాయణంతో అద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. ఈ క్రమంలోనే ప్రజలు కుల, మత, వర్ణ విబేధాలు లేకుండా ఆ బాల రాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్నారు.

ఆలయ ప్రాంగణంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తుల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. భక్తుల తమ ఒంటిపై ధరించిన బంగారం, వెండి, విలువైన విస్తువులను కొట్టేస్తున్నారు. అలా ఇప్పటి వరకు 60 మంది మహిళల మంగళ సూత్రాలు దొంగలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులు విలువైన వస్తువులు ధరించి రాకూడదంటూ ఆలయ నిర్వహకులు సూచనలు చేస్తున్నారు.


Similar News