చెక్కు చెదరకుండా ఉండేందుకు రామ మందిర నిర్మాణంలో ఏం ఉపయోగించారో తెలుసా?
గత కొద్ది కాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాకంగా నిర్మించిన రామమందిర ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి.
దిశ, ఫీచర్స్: గత కొద్ది కాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాకంగా నిర్మించిన రామమందిర ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. ఉత్తర ప్రదేశ్ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 22 న రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందడంతో ఇప్పటికే చాలా మంది అక్కడి చేరుకున్నారు. అయోధ్యలోని రామ మందిరం పొడవు 380 అడుగులు. వెడల్పు 250 అడుగులు. ఎత్తు 161 అడుగులతో నిర్మించారు. ఆలయంలో మూడంతస్తులు ఉంటాయి.
ఒక్కోటి 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం మీద 392 స్తంభాలు, 44 డోర్లు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో.. శ్రీ రామ్ లల్లా (రాముడి బాల్యం) విగ్రహం ఉంటుంది. ఆలయంలోని స్తంభాలు, గోడలకు దేవుళ్ల విగ్రహాలు, ఇతిహాసాల కథలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే,, తాజాగా, ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రామ మందిర నిర్మాణంలో అసలు ఒక్క ఇనుప ముక్కను కూడా ఉపయోగించలేదని తెలుస్తోంది. ఎంత పెద్ద భూకంపం వచ్చినా ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉండేందుకు ఆర్సీసీ (రోల్ కాంపాక్టెడ్ కాంక్రీట్)తో ఫౌండేషన్ వేశారని సమాచారం.